
లండన్ : సాకర్ లెజెండ్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ప్రతిష్టాత్మక ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును మరోసారి సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో నార్వే ప్లేయర్ ఇర్లింగ్ హాలాండ్ హోరాహోరీగా తలపడ్డాడు. వివిధ దేశాల నేషనల్ కోచ్‌లు, కెప్టెన్లు, ఎంపిక చేసిన జర్నలిస్టులతో కూడిన గ్లోబల్ ప్యానెల్‌తో పాటు ఫ్యాన్స్ పాల్గొన్న ఆన్‌లైన్ ఓటింగ్‌లో మెస్సీ, హాలాండ్ చెరో 48 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో విన్నర్‌ను తేల్చేందుకు టై బ్రేకర్‌ను ఆశ్రయించారు. ఇందులో నేషనల్ టీమ్ కెప్టెన్ల ఓట్లలో ఎక్కువ ఫస్ట్ ప్లేస్ ఓట్లు లేదా 5 పాయింట్ల స్కోర్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో మెస్సీకి 107 పాయింట్లు లభించగా.. హాలాండ్‌కు 64 ఓట్లే వచ్చాయి. దాంతో మెస్సీనే అవార్డు వరించింది. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కిలియన్ ఎంబపే మూడో స్థానంలో నిలిచాడు.