ముక్కోణపు సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. టీ20 ఫార్మాట్ లో పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే ట్రై సిరీస్ ఆడనున్నాయి. మంగళవారం (నవంబర్ 18) నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ నవంబర్ 29 వరకు జరుగుతోంది. సొంతగడ్డపై జరగనుండడంతో పాకిస్థాన్ ఈ ట్రై సిరీస్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. శ్రీలంక జట్టు పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు జింబాబ్వే సంచలన ఫలితం కోసం ఎదురు చూస్తుంది. మ్యాచ్ లన్నీ రావల్పిండి స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. టాస్ 6 గంటలకు వేస్తారు.
కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ తో జింబాబ్వే తలపడుతోంది. మిగిలిన మ్యాచ్‌లు నవంబర్ 20, 22, 23, 25, 27 తేదీల్లో జరగనున్నాయి. టాప్-2లో నిలిచిన జట్లు నవంబర్ 29న ఫైనల్ ఆడతాయి. దురదృష్టవశాత్తు.. ఇండియాలో ఈ ట్రై సిరీస్ లైవ్ స్ట్రీమింగ్. లైవ్ టెలికాస్టింగ్ లేదు. స్పోర్ట్స్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారమవుతాయి. 2026 టీ20 వరల్డ్ కప్ కు ముందు మూడు జట్లకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్ లా ఉంటుంది. పాకిస్తాన్ వైమానిక దాడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ట్రై-సిరీస్ నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ తప్పుకున్న ఈ సిరీస్ యధావిధిగా జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో జింబాబ్వే ఈ ట్రై సిరీస్ ఆడనుంది.
ట్రై-సిరీస్ షెడ్యూల్:
నవంబర్ 18 - పాకిస్తాన్ vs జింబాబ్వే, 6:30 గంటలకు
నవంబర్ 20 - శ్రీలంక vs జింబాబ్వే, 6:30 గంటలకు
నవంబర్ 22 - పాకిస్తాన్ vs శ్రీలంక, 6:30 గంటలకు
నవంబర్ 23 - పాకిస్తాన్ vs జింబాబ్వే, 6:30 గంటలకు
నవంబర్ 25 - శ్రీలంక vs జింబాబ్వే, 6:30 గంటలకు
నవంబర్ 27 - పాకిస్తాన్ vs శ్రీలంక, 6:30 గంటలకు
నవంబర్ 29 - ఫైనల్, 6:30 గంటలకు
పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే స్క్వాడ్స్:
పాకిస్థాన్:
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ మరియు ఉస్మాన్ తారిఖ్
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరనాగ, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, మరియు ఎషాన్ మలింగ
జింబాబ్వే:
సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తాడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియోన్ న్హువారి, రిచర్డ్‌డాన్‌గార్ టాయ్‌లోర్ మరియు
