రైతు కుటుంబాలకు ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆర్ధిక సాయం

రైతు కుటుంబాలకు ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆర్ధిక సాయం

సిద్ధిపేట: ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 100 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆర్ధి సాయం అందించారు. సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో రైతు కుటుంబాలకు చక్రధర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని, అలాంటి రైతుకు సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. తమ ఫౌండేషన్ తరపున 100 మంది రైతు కుటుంబాలకు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే  రాజకీయ లబ్ది కోసమే తాను ఇదంతా చేస్తున్నానని కొంత మంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.100 కోట్లు ఇస్తే పదవులు తన వద్దకే వస్తాయని, కానీ తనకు ఎలాంటి రాజకీయం స్వార్ధం లేదని పేర్కొన్నారు. సీబీఐ, ఐటీ అంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని, అయితే అలాంటి వాళ్లకు తాను భయపడనని చక్రధర్ స్పష్టం చేశారు.