ట్రాఫిక్ నిబంధనలపై గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం

ట్రాఫిక్ నిబంధనలపై గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్న సమయంలో.. గుజరాత్ సీఎం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒక వారం రోజుల పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎలాంటి జరిమానా విధించవద్దని ఆదేశించారు. అక్టోబర్ 21నుండి 27వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఎటువంటి జరిమానా విధించబడదని సీఎం భూపేంద్ర స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇది ముఖ్యమంత్రి భూపేంద్ర ప్రజలకు అనుకూలంగా తీసుకున్న మరో నిర్ణయమని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం షేర్ చేశారు.

ఈ వీడియోతో పాటు చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని మంత్రి ట్వీట్ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, గుజరాత్ పోలీసులు వారికి పూలు ఇచ్చి నిబంధనలు పాటించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తారని తెలిపారు.