గుర్తుంచుకో.. నువ్వు గొప్ప ఆల్రౌండర్ అయితవ్ : యోగరాజ్ సింగ్

గుర్తుంచుకో.. నువ్వు గొప్ప ఆల్రౌండర్ అయితవ్ :  యోగరాజ్ సింగ్

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ అరంగేట్రంలో తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని సాధించిన అర్జున్ టెండూల్కర్‌ ను  ఇండియన్ క్రికెట్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అభినందించారు.  "బాగా బ్యాటింగ్ చేశావ్.. ఏదో ఒక రోజు గొప్ప ఆల్ రౌండర్ అవుతావు.. నా మాటలను గుర్తుంచుకో " అని ఆయన అభినందించారు.  రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. 178 బంతుల్లో సెంచరీ పూర్తి  చేశాడు. ఇందులో 16 ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. 15 ఏళ్ల వయసులో సచిన్‌ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టారు.

ఈ మ్యాచ్ కంటే ముందుగా అర్జున్.. యోగ్‌రాజ్‌ సమక్షంలో ట్రైన్‌ అయ్యాడు. అర్జున్‌ను మెంటర్‌గా ట్రైన్ చేసిన యోగ్‌రాజ్‌ సక్సెస్ అయ్యారు. అయితే ఈ ట్రైనింగ్ టైమ్ లో అర్జున్‌కు  యోగ్‌రాజ్‌ చెప్పిన సూత్రం ఒక్కటే.. నువ్వు సచిన్‌ కొడుకువన్న విషయం మర్చిపో.. అదే నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్తుందని ఆయన  చెప్పేవారట.  అర్జున్ టెండూల్కర్ కి క్రికెట్ తో పాటుగా  డాన్స్ ఎలా చేయాలో  కూడా యోగరాజ్ నేర్పించారట. దీనికి సంబంధించిన వీడియో  కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.