బెగ్గర్స్ కోసం స్పెషల్ ఆపరేషన్

బెగ్గర్స్ కోసం స్పెషల్ ఆపరేషన్

సిగ్నల్స్ వద్ద వేధిస్తున్నారంటూ పోలీసులకు పెరుగుతున్న ఫిర్యాదులు
 గుర్తించి షెల్టర్‌‌‌‌ హోమ్స్ కు తరలిస్తున్న పోలీస్, బల్దియా సిబ్బంది

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీ రోడ్లపై పైసల కోసం భిక్షగాళ్లు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. రెడ్​సిగ్నల్​పడగానే జంక్షన్లలో కాచుకొని ఉంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వరుస ఫోన్లు, ట్విట్టర్​లో కంప్లైంట్స్​వస్తున్నాయి. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్పెషల్​ఆపరేషన్​చేపట్టారు. జీహెచ్‌‌‌‌ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్‌‌‌‌ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌‌‌‌ వద్ద భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి సిటీలోని షెల్టర్​హోమ్స్​కు తరలిస్తున్నారు. ఈ విషయంపై ట్రాఫిక్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రంగనాథ్‌‌‌‌ ఆధ్వర్యంలో ఈ నెల 18న సమీక్షా  సమావేశం నిర్వహించారు. అందులో బల్దియా అర్బన్‌‌‌‌ కమ్యూనిటీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు, ట్రాఫిక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిటీలో బెగ్గర్స్‌‌‌‌ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించి స్పెషల్​డ్రైవ్​చేపట్టారు.
ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు
రద్దీ ఎక్కువగా ఉండే సిగ్నల్స్‌‌‌‌ వద్ద పదుల సంఖ్యలో భిక్షగాళ్లు ఉంటున్నారు. చంటి పిల్లలను చూపిస్తూ అడుక్కుంటున్నారు. సిగ్నల్‌‌‌‌ పడగానే కార్లు, బైక్స్​వద్దకు వెళ్లి పైసలు అడుగుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌‌‌‌ అవుతోంది. అబిడ్స్‌‌‌‌, ఎంజే మార్కెట్, మసాబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ సహా ప్రధాన రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా బెగ్గర్స్​కదలికలు తెలుసుకున్నారు. ఇలా సిటీలోని బెగ్గర్స్‌‌‌‌ను మూడు రోజులుగా తరలిస్తున్నారు. కొందరిని కౌన్సిలింగ్‌‌‌‌ ఇచ్చి పంపిస్తున్నారు. అలాగే పగలు ఫుట్‌‌‌‌పాత్​లపై ఉంటున్న వారిని కూడా ట్రేస్ చేస్తున్నారు. షెల్టర్ హోమ్స్‌‌‌‌లో ఉండలేని వారిని సిటీ శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు.