వరకట్నం కోసం ఆగిన రిటైర్డ్ డీఎస్పీ కొడుకు పెళ్లి

వరకట్నం కోసం ఆగిన రిటైర్డ్ డీఎస్పీ కొడుకు పెళ్లి

అతనేమో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ కమిషనర్ ఆమె ఒక డాక్టర్ అయినా వరకట్నం కోసం పీఠలపై పెళ్లి ఆగిపోయింది. పెళ్లికే ముందే వరకట్నం ఇవ్వాలని పెళ్లి కొడుకు తరపున వారు పట్టుబట్టారు. దీంతో పెళ్లి కూతరు పెళ్లి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన చెన్నైలోని అన్నానగర్లో జరిగింది.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న సుమతి మరైమలైనగర్ కు చెందిన రిటైర్డ్ డీఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కొడుకు బాలమురళీధరన్ తో పెద్దల సమక్షంలో పెళ్లి ఖాయం అయింది. బాలమురళీ ధరన్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే పెళ్లికి కట్నకానుకలుగా రూ.50 లక్షల నగదు, మూడు కోట్లకు పైగా విలువ చేసే ఇళ్లును ఇస్తామని సుమతి తల్లిదండ్రులు  ఇరువురి సమక్షంలో పెళ్లి  నిశ్చయించుకున్నారు. అయితే పెళ్లి దగ్గర పడుతున్నా కొద్దీ  కట్నంగా ఇస్తామన్న డబ్బు ,ఇంటిని పెళ్లికి ముందే ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. పెళ్లి కొడుకు తరపున వారు.  దీంతో రూ. 10 లక్షల నగదును పెళ్లికి ముందే ఇచ్చారు. అయినా పెళ్లి కొడుకు తరుపున ఇళ్లు, మిగతా డబ్బు కూడా పెళ్లికి లోపే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పెళ్లి కూతురు తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడి తరపున వాళ్లను విచారిస్తున్నారు.