SBI ATMలో డబ్బులు తీస్తున్నారా..? కొత్త రూల్ వచ్చేస్తుంది.. 15 రూపాయలు ఛార్జీ.. GST కూడా కట్టాల్సిందే !

SBI ATMలో డబ్బులు తీస్తున్నారా..? కొత్త రూల్ వచ్చేస్తుంది.. 15 రూపాయలు ఛార్జీ.. GST కూడా కట్టాల్సిందే !

SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBD) ఖాతాదారులు నెలకు నాలుగు సార్లుకు మించి క్యాష్ విత్ డ్రా చేస్తే ఛార్జీలు విధించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. SBI సవరించిన షెడ్యూల్ ప్రకారం.. BSBD ఖాతాదారులు నాలుగు లావాదేవీలకు మించి క్యాష్ విత్ డ్రా చేస్తే.. ఆ పై చేసే ప్రతీ విత్ డ్రాపై 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ 15 రూపాయలు మాత్రమే కాదు.. ప్రతీ లావాదేవీకి GST అదనంగా వర్తిస్తుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ సవరించిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

సింపుల్గా చెప్పాలంటే.. నెలలో ఐదో సారి నుంచి చేసే ప్రతీ క్యాష్ విత్ డ్రాకు ఛార్జీలు పడతయ్. జీఎస్టీ కూడా ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది. నెలలో నాలుగు విత్ డ్రాలు మాత్రం ఎప్పటిలానే ఉచితంగా చేసుకోవచ్చు. ఐదు, ఆరు.. ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్ని సార్లు ఆ నెలలో 15 రూపాయల ఛార్జీతో పాటు GST కట్టక తప్పదు.

SBI BSBD అకౌంట్ అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే జీరో-బ్యాలెన్స్ పొదుపు ఖాతా. ఈ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఈ ఖాతాలను తీసుకొచ్చారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఫ్రీగా ATM కార్డు కూడా ఇస్తారు.

ఎలాంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు కూడా డెబిట్ కార్డు వాడుకుంటున్నందుకు కట్టాల్సిన పనిలేదు. RuPay డెబిట్ కార్డు ఫ్రీగా ఇస్తారు. NEFT, RTGS విధానాల్లో నిధుల బదిలీలకు ఎటువంటి ఖర్చు ఉండదు. అయితే.. ఈ అకౌంట్ ఉన్న ఖాతాదారుడికి SBIలో మరే ఇతర సాధారణ పొదుపు ఖాతా ఉండకూడదు.