
కదలికలు లేకుంటే.. శరీరం కూడా పాడుబడ్డ బండిలెక్కనే తయారైతది. జాయింట్లు గట్టిగ లేకుంటే చిన్న గాయం కూడా పెద్ద ప్రమాదమై కూసుంటది. అందుకే జాయింట్లు గట్టిగా ఉండాలె. అక్కడ ఉండే శక్తి కేంద్రాలను ఉత్తేజ పరచాలె. దీనికి సూక్ష్మ యోగకు మించిన టెక్నిక్ లేదు. అంతేనా, దీంతో ప్రాణశక్తి కూడా పెరుగుతది. ఇతర ఆసనాలు, ఎక్సర్సైజ్లతో పోలిస్తే.. సూక్ష్మ యోగ చెయ్యడం చాలా సులభం. సూక్ష్మ యోగకు ఎవరి సాయం అక్కర్లేదు! నిలబడి.. కూర్చొని ఎట్లైనా చేయొచ్చు.
కుడి నుంచి ఎడమకు మెడను తిప్పాలి. అలాగే ఎడమ నుంచి కుడికి తిప్పాలి. తర్వాత తలను సవ్య, అపసవ్య దిశలో మొత్తం.. రెండువైపులా పదిసార్లు చెయ్యాలి. మెడ తిప్పేటప్పుడు కళ్లు మూసుకోవడం మర్చిపోవద్దు.
►ALSO READ | ఎండలో బండి భద్రం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ బండి సేఫ్. జర్నీ అంతకంటే సేఫ్..!
లాభాలు
వామప్ లేకుండా అసనాలు లేదా ఇతర ఎక్స రీసైజులు చేయకూడదు. అలా చేస్తే గాయాల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ సూక్ష్మ యోగ మంచి వామప్ లా పని చేస్తుంది. వీటిని ఒక్కొక్కటి ఇరవైసార్ల వరకు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చాలా సేపు కూర్చున్నప్పు డు.. చాలా సేపు పడుకున్నప్పుడు వెంటనే సూక్ష్మయోగా చేస్తే రీఫ్రెష్ అవుతారు.
ఫోటోలో కనిపిస్తున్నట్లుగా చేతులను నేలకు సమాంతరంగా ముందుకు చాచి.. పిడికిలిని గట్టిగా ముయ్యాలి. తర్వాత పిడికిలిని నెమ్మదిగా విప్పి.. వేళ్లను గట్టిగా బయటకు స్ట్రెచ్ చెయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఫోటోలో కనిపిస్తున్నట్టుగా అరచేతులను భుజాలపైకి తీసుకురావాలి. తర్వాత భుజాలను సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి. ఇందులో మరో రెండు వేరియేషన్స్ ఉంటాయి. మోచేతులను ఆనిస్తూ చేసే రొటేషన్ ఒకటి, మోచేతులను నిటారుగా పైకి లేపి చేసే రొటేషన్ ఇంకొకటి.
చేతులను నేలకు సమాంతరంగా ముందుకు చాచాలి. ఫోటోలో కనిపిస్తున్నట్లుగా పిడికిలిని బిగించి చేతి మణికట్టును కిందికి, పైకి అనాలి. తర్వాత మణికట్టును సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా ఈ రెండు వేరియేషన్స్ లో పదిసార్లు చెయ్యాలి.
నమస్కార ముద్రలో.. అన్ని చేతి వేళ్లు ఒక దానితో మరొకటి కలిసేట్టుగా పదిసారు చప్పట్లు కొట్టాలి.
నిటారుగా నిలబడి, పాదాలను దగ్గరకు తీసుకురావాలి. తర్వాత మోకాళ్లను ఒకదానికి మరొకటి ఆనించి ఇరవైసార్లు సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి.
చెవులను రెండు చేతులతో పట్టుకుని.. అటుఇటూ తిప్పాలి.. ఇలా చెవులు వేడెక్కే వరకు తిప్పాలి.
బొంగరాన్ని తిప్పినట్లు కనుగుడ్లను 56 సార్లు... సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి, మధ్యమధ్యలో కొద్ది సేపు విరామం తీసుకున్నా పర్వాలేదు.
కళ్లను గట్టిగా మూయాలి. తర్వాత సాధ్యమై వంత వెడల్పుగా కళ్లు తెరిచి చూడాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. మెల్లిగా గాలి పీల్చుకుంటూ నోటిని వీలనైంతగా చచి.. గాలి వదులుతూ నోటిని ముయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఫోటోలో కనిపిస్తున్నట్టుగా... కుడి అరచేతిని తేలికగా ఎడమ చెవిపై ఆనించి కుడివైపు వంచాలి. అదే విధంగా ఇంకోవైపు కూడా చేయాలి. ఇలా రెండు వైపులా కలిపి ఇరవైసార్లు చెయ్యాలి.
-కమల్ మలిరమణి, యోగా నిపుణులు, హైదరాబాద్