
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి ప్రభావంతో కొన్ని సార్లు వాహనాలు దగ్ధమైన ఘటనలు చూస్తేనే ఉన్నం. ఇంజిన్ బాగా వేడెక్కడం, పెట్రోల్ లీకవడం వంటి కారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అందుకే వేసవిలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ టైర్లలో ఎంత గాలి ఉండాలో వాహన తయారీదారుల సూచనలు ఫాలో అవ్వాలి. అయితే వాళ్ల సూచనల ప్రకారం టైర్లలో గాలి ఉండే పరిమాణం సాధారణ ఉష్ణోగతా పరిస్థితుల్లోనే. అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో కాదు. వేడి తగిలితే గాలి వ్యాకోచిస్తుందనే సంగతి తెలిసిందే. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్లు వేడిగా ఉంటాయి. ముఖ్యంగా 50 డిగ్రీలకు అష్టోగ్రత చేరిందంటే వేడి ప్రభావం కచ్చితంగా టైర్లపై ఉంటుంది.
వేడి తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించాలంటే టైర్లలో గాలి వంద శాతం ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డుపై ఉండే వేడి ప్రభావానికి గాలి వేడెక్కి టైరు పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఐదు శాతమైనా గాలి తక్కువగా ఉండాలి. సాధారణ గాలికి బదులు నైట్రోజన్ అయితే సురక్షితం. అలాగే నాణ్యమైన టైర్లు మాత్రమే వాడాలి. ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే ప్రతి నలభై కిలోమీటర్లకు ఒకసారి ఐదు నిమిషాలు ఆగాల్సిందే.
ఇంజిన్ వేడెక్కడం:
ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో పగటిపూట ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. అందువల్ల ఎండలో బైకులపై ప్రయాణించేటప్పుడు.. అక్కడక్కడా నీడలో ఆగి వెళ్లాలి. కనీసం ఐదు నిమిషాలు ఆగితే ఇంజిన్ కాస్త చల్లబడుతుంది. బైక్ ఆపినప్పుడు పెట్రోల్ ఆఫ్ చేయాలి. లేకపోతే పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి, లీకయ్యే ప్రమాదం ఉంది. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు పెట్రోల్ లీకైతే మంటలు అంటుకోవచ్చు. ఇంకన్ వేడిక్కి ఓవర్ ఫ్లో అయితే బైక్ త్వరగా స్టార్ట్ కారు. ఇంధనం పూర్తిగా ఆవిరైన తర్వాత్ వాహనం స్టార్ట్ అవుతుంది. కార్లకు సంబంధించి వాహనంలోని రేడియేటర్ ఏసీలో సమస్యలు ఏర్పడతాయి. గ్యాస్ కిట్ ఉపయోగించే వాహనదారులు కిట్ ఫై వస్త్రం లేదా గోనె సంచి కప్పడం మంచిది. తరచూ గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవాలి. రెండు రోజులకోసారి రేడియేటర్ కూలెంట్ స్థాయిని పరిశీలించాలి. కూలెంట్ ఆయిల్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. కారు స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి ముందే ఏసీ అన్ చేయాలి.
►ALSO READ | ట్రెండింగ్లో సిందూర్: అసలు సిందూర్ అంటే ఏమిటి..? హిందువులు దానికి అంత ప్రాముఖ్యత ఎందుకిస్తారు..?
నీడలోనే:
ఎండలు బాగా ఉన్నప్పుడు టూ వీలర్, ఫోర్ వీలర్లను నీడలోనే ఉంచాలి. ఎండలో వాహనాల్ని ఉంచితే వాటి రంగు త్వరగా మారిపోతుంది. బాడీపై చిన్న చిన్న పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే వాహనాలను నీడలోనే ఉంచాలి. వాటిపై ఫ్యాబ్రిక్ కవర్స్ కప్పాలి. వాహనాలకు చెందిన కనెక్టింగ్ వైర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది ట్యాంకు నిండుగా పెట్రోల్ పోయిస్తుంటారు. వేసవిలో ఎండ వేడికి కొంత మేర పేట్రోల్ అవిరైపోతుంది. అందుకేట్యాంకులో సగానికి మించకుండా పెట్రోల్ పోయించుకోవాలి. ట్రాఫిక్ లో ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా 'ఎమర్జెన్సీ రోడ్ సైడ్ కిట్" వెంట ఉంచుకోవాలి.
ఐదు నిమిషాలు ఆగితే వేడి తగ్గుతుంది...
బైక్ లను ఎక్కువ సేపు ఎండలో ఉంచితే రంగు పోతుంది. ఎండ వేడికి వాహనాల టైర్లు పగిలే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు ఎండలో బైక్ నడపరాదు. 40 కిలోమీటర్లకు ఒక్కసారి ఐదు నిమిషాలు విరామం అవసరం. పెట్రోల్ ట్యాంకులు లీకయ్యే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు నీడపట్టునే వాహనాలను నిలిపేలా చూసుకోవాలి. ప్రయాణ సమయంలో చెట్ల నీడలో ఉంచాలి.
-రాము, సీనియర్ మెకానిక్, రామకృష్ణాపూర్,