ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం.. బీ వన్ టెస్ట్స్ అసెస్మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌

ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం.. బీ వన్  టెస్ట్స్ అసెస్మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు:  ఎడ్యుటెక్​ కంపెనీ బీ వన్​మీడియా 1–6 తరగతుల విద్యార్థుల కోసం 'బీవన్ టెస్ట్స్' పేరుతో ఏఐ ఆధారిత మ్యాథ్స్, ఇంగ్లిష్ అసెస్‌‌మెంట్ ప్లాట్‌‌ఫామ్‌‌ను ఢిల్లీలో మంగళవారం ప్రారంభించింది.  విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి 10 నిమిషాల పరీక్షలు ఇందులో ఉంటాయి. సీబీఎస్ఈ, ఐబీ వంటి సంస్థల సిలబస్​ప్రకారం టెస్టులను తయారు చేశారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను ముందుగానే గుర్తించడం దీని ప్రత్యేకత. 

అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్లాట్​ఫారమ్​ను ఉచితంగా అందిస్తామని బీ వన్ మీడియా సీఈఓ బాలాజీ ప్రకటించారు. ట్యూటర్లకు బోధనా ప్రణాళికలు రూపొందించడానికి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. బీ వన్ టెస్ట్స్ వార్షిక చందా ధర రూ.రెండు వేలు కాగా, పరీక్షల ధర ఒక అధ్యాయానికి రూ.25 నుంచి ప్రారంభమవుతుందని బాలాజీ తెలిపారు.