డ్రగ్స్ కేసును విజిలెన్స్ కు అప్పగించండి: పద్మనాభ రెడ్డి

డ్రగ్స్ కేసును విజిలెన్స్ కు అప్పగించండి: పద్మనాభ రెడ్డి

సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులకు క్లీన్ చీట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్ విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి అన్నారు. ఆర్టీఐ ద్వారా డ్రగ్స్ కేసు వివరాలను సేకరించిన ఆయన  సిట్ పై తమకు నమ్మకం లేదని..ఏసీబీ, లేదా విజిలెన్స్ తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సినీ ప్రముఖుల నుంచి నమూనాలు సేకరించినా  కేసులో ఇంతవరకు  పురోగతి లేదన్నారు.డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు  12 మందిపై కేసు నమోదు చేసి 4 చార్జీ షీట్ లు దాఖలు చేస్తే..వాటిలో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడమేంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల ఒత్తిళ్ల వల్ల డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు.