రూపాయి బక్కగ.. ఫారిన్‌ సదువు బరువుగా

రూపాయి బక్కగ.. ఫారిన్‌ సదువు బరువుగా

భారీగా పతనమవుతున్న రూపాయి

భారమవుతున్న  ఎడ్యుకేషన్ లోన్స్

ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు

లోన్అమౌంట్పెంచుతున్న బ్యాంకులు

రూపాయి బలహీనపడుతుండటంతో చదువుకు తీసుకునే రుణాలు భారమవుతున్నాయి. పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకుంటున్న తల్లిదండ్రులు అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నారు. గత జులైలో మార్కెట్‌‌లో రూ. 68.5 ఉన్న డాలర్‌‌ విలువ.. ఈ వారం రూ.72కు చేరింది. దీంతో విదేశాల్లో సుమారు 40 వేల డాలర్ల ట్యూషన్‌‌ ఫీజు చెల్లిస్తున్న స్టూడెంట్లపై అదనంగా రూ.1.4 లక్షల భారం పెరిగింది. ప్రస్తుతం విద్యా రుణాలు తక్కువగా ఇస్తున్నారని, పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కొత్తగా విద్యా ప్లస్‌‌ స్కీమ్‌‌

‘ప్రస్తుతం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి కార్యక్రమం ద్వారా రూ.20 లక్షల వరకు లోన్‌‌ ఇస్తున్నారు. కానీ అమెరికాలో చదువు ఖర్చు పెరగడంతో లోన్‌‌ను రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు’ అని కార్పొరేషన్‌‌ బ్యాంకు ఎండీ పీవీ భారతి చెబుతున్నారు. అందుకే డిమాండ్‌‌ తగ్గట్టు కొత్త స్కీమ్‌‌లు ప్రారంభిస్తున్నామన్నారు. గత నెలలో విద్యా ప్లస్‌‌ పథకం స్టార్ట్‌‌ చేసి ఎక్కువ లోన్‌‌ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌‌బీఐ మాత్రమే ప్రస్తుతం గ్లోబల్‌‌ అడ్వాంటేజ్‌‌ లోన్స్‌‌ కింద రూ.1.5 కోట్ల వరకు ఇస్తోంది. ఇంకొందరు బ్యాంకర్లేమో రూపాయి పతనం ఏడాదికి పైగా ఉంటేనే ఎక్కువ సమస్యవుతుందని,  విలువ పడుతూలేస్తూ ఉంటే ఏంకాదని అంటున్నారు

ఎడ్యుకేషన్‌‌ లోన్స్‌‌ భద్రమే: బ్యాంకులు
ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చిన ఎడ్యుకేషన్ లోన్స్‌‌లో ఇప్పటికే 15 నుంచి 25 శాతం వరకు ఎన్‌‌పీఏలు ఉన్నాయి. కానీ బ్యాంకులు మాత్రం మరోలా చెబుతున్నాయి. ఓవర్‌‌సీస్‌‌ ఎడ్యుకేషన్‌‌ లోన్లు చాలా వరకు భద్రమంటున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులను తనఖా పెట్టుకొనే లోన్లు ఇస్తున్నామని కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌‌ఏ శంకరనారాయణ్‌‌ చెప్పారు. ఓపెన్‌‌ మార్కెట్‌‌లో రూపాయి బలహీనపడటంతో ప్రస్తుతం లోన్‌‌ లిమిట్‌‌ను రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచామన్నారు. మరోవైపు రుపాయి విలువ ఏడాదికి పైగా పడిపోతూ ఉంటే విదేశాల్లో తీసుకున్న లోన్లు కట్టడం కష్టమైపోతుందని, ఎక్కువ డబ్బులిచ్చి డాలర్లు కొనుక్కోవాల్సి వస్తుందని ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి.