విదేశీ విమానాల సర్వీసులు మే ఆఖరు వరకు రద్దు

విదేశీ విమానాల సర్వీసులు మే ఆఖరు వరకు రద్దు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ విమాన సర్వీసులపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. డబుల్ మ్యుటెంట్, విదేశీ వేరియంట్ కేసులు పెరుగుతుండడం గుర్తించి ఇప్పటికే విదేశీ విమానాల సర్వీసులు కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. మే నెలలో సెకండ్ వేవ్ మహమ్మారి మరింత ప్రమాదకరంగా విజృంభించే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపధ్యంలో విదేశీ విమానాల రద్దును నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ నిషేధం విధింపు ప్రయాణికుల విమానాలకు మాత్రమేనని.. కార్గొ విమాన సర్వీసులను నిషేధం నుంచి మినహాయించామని స్పష్టం చేశారు.