ఫారిన్ లిక్కర్ రేటు ఎక్కువైనా కొంటున్నరు 

ఫారిన్ లిక్కర్ రేటు ఎక్కువైనా కొంటున్నరు 
  • లగ్జరీ, ప్రెస్టేజీకే ప్రయారిటీ.. 30 శాతం పెరిగిన సేల్స్ 
  • ఈ ఏడాది సర్కార్ కు 27 వేల కోట్ల మద్యం ఆమ్దానీ 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఫారిన్‌‌ లిక్కర్‌‌ మస్తు తాగుతున్నారు. ఈ బ్రాండ్లకు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. లగ్జరీ, ప్రెస్టేజీ కోసం ఫారిన్ బ్రాండ్లకే ప్రయారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో 2,620 వైన్స్‌‌తో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. వీటికి డిపోల నుంచి మద్యం రవాణా అవుతుంది. రాష్ట్రంలో ఏడాది, రెండేండ్ల కింద వరకు అధికంగా చీప్‌‌ లిక్కర్‌‌ అమ్ముడయ్యేది. ఇవి లోకల్‌‌గానే తయారవుతాయి. అయితే క్రమక్రమంగా చీప్‌‌ లిక్కర్‌‌ అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. రోజురోజుకు ఫారిన్‌‌ లిక్కర్‌‌ బ్రాండ్ల సేల్స్‌‌ పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే 30 శాతం సేల్స్‌‌ పెరిగాయని అధికారులు చెబుతున్నారు. మధ్యతరగతి, ఆపై స్థాయి వారు ఫారిన్‌‌ లిక్కర్‌‌కే ప్రయారిటీ ఇస్తున్నారు. పెండ్లిళ్లు, దావత్‌‌లు, బర్త్‌‌ డేలు తదితర ఫంక్షన్లలో ఫారిన్‌‌ బ్రాండ్లనే తాగుతున్నారు. చాలా మంది ప్రెస్టేజీ కోసం ఫుల్‌‌‌‌ బాటిల్‌‌‌‌ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల విలువైన లిక్కర్‌‌‌‌నే వేడుకల్లో తాగిపిస్తున్నారు. ఇక రోజువారీగా నైట్ పార్టీల్లోనూ చాలామంది ఫారిన్‌‌‌‌ బ్రాండ్సే తాగుతున్నారు. 

స్పెషల్ గా లిక్కర్ బ్యాంకులు.. 

ఫారిన్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ ఉండటంతో ఫారిన్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్‌‌‌‌ లాంటి నగరాల్లో స్పెషల్‌‌‌‌గా బ్యాంక్‌‌‌‌లు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా హైటెక్‌‌‌‌సిటీ, మాదాపూర్‌‌‌‌, గచ్చిబౌలి, కొండాపూర్‌‌‌‌, మియాపూర్‌‌‌‌, కూకట్‌‌‌‌పల్లి, జూబ్లీహిల్స్‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌, అమీర్‌‌‌‌పేట ప్రాంతాల్లో ఈ బ్యాంక్ లు వెలిశాయి. బార్లలోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్‌‌‌‌ లోనూ ఫారిన్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాల్లో కూడా సేల్స్ కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల్లో కొన్ని బ్రాండ్లు, తక్కువ ధర మద్యం మాత్రమే లభిస్తోంది. 

ఆన్ లైన్ లోనూ సెర్చ్ చేస్తున్రు.. 

రాష్ట్రంలో అన్ని రకాల ఫారిన్ బ్రాండ్స్‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి. జానీవాకర్‌‌‌‌, జానీవాకర్‌‌‌‌ ఎక్సో, జానీ వాకర్‌‌‌‌ ప్లెజర్‌‌‌‌, జానీవాకర్‌‌‌‌ బ్లూ, జానీవాకర్‌‌‌‌ డబుల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌, జానీవాకర్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ లేబుల్‌‌‌‌, రెడ్‌‌‌‌ లేబుల్‌‌‌‌, బ్లాక్‌‌‌‌ లేబుల్‌‌‌‌, చివాస్‌‌‌‌ రీగల్, చివాస్‌‌‌‌ రీగల్ ఎక్స్ ట్రా, డాన్‌‌‌‌ పెరిగ్నన్‌‌‌‌, మార్టిన్‌‌‌‌, జెంటిల్‌‌‌‌మెన్‌‌‌‌, మంకీ షోల్టర్‌‌‌‌, గ్లెన్‌‌‌‌లీవిట్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ఫిడిక్‌‌‌‌, మేక్‌‌‌‌లాన్‌‌‌‌, బెయిలీస్‌‌‌‌, రాయల్‌‌‌‌ సెల్యూట్‌‌‌‌, సౌజా టిక్విలా, జాన్‌‌‌‌ క్వెయిరీ తదితర బ్రాండ్లపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బ్లూ లెబుల్‌‌‌‌, బ్లాక్‌‌‌‌ లెబుల్‌‌‌‌ ఎక్కువగా సేల్‌‌‌‌ అవుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఫారిన్‌‌‌‌ లిక్కర్‌‌‌‌కు ధర కూడా ఎక్కువగానే ఉంది. వివిధ రకాల బ్రాండ్‌‌‌‌లలో రూ.50 వేల దాకా అందుబాటులో ఉన్నాయి. చీప్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ కంటే ఫారిన్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌పై అధికంగా ట్యాక్స్‌‌‌‌ సమకూరుతుందని ఆబ్కారీ అధికారులు చెప్పారు. కాగా, ఫారిన్‌‌‌‌ బ్రాండ్ల కోసం యూత్ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లోనూ సెర్చ్‌‌‌‌ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్ల గురించి తెలుసుకుంటున్నారు.