జవహర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ లో ఫారిన్ లిక్కర్ విక్రయాలు

జవహర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ లో ఫారిన్ లిక్కర్ విక్రయాలు

జవహర్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌‌‌‌‌‌‌‌నగర్ బాలాజీ నగర్‌‌‌‌‌‌‌‌లో నివాసముండే ఓ నాయకుడు, అతని సోదరుడు విదేశాలు, గోవా నుంచి మద్యం బాటిళ్లను నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

ఘట్​కేసర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. సుమారు 370 విదేశీ, గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.