పర్వతగిరి (సంగెం), వెలుగు: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో 25 గ్రామాల్లోని 72 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం సంగెం మండలం కాట్రపల్లిలో వరంగల్ నుంచి సంగెం, కుంటపల్లి మీదుగా నడిచే నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కాట్రపల్లి నుంచి సంగెం వరకు ఆయన బస్ నడిపారు.
