చైనాకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ వార్నింగ్​

చైనాకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ వార్నింగ్​
  • బార్డర్​లో ఎలాంటి సవాల్​ ఎదురైనా తిప్పికొడతామని వెల్లడి
  • పెట్రోలు, డీజిల్​ కొనుగోలుపై  ఏ దేశమూ ఆర్డర్​ వేయలేదని వ్యాఖ్య 

కంపాలా(ఉగాండా): విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ చైనాకు వార్నింగ్​ ఇచ్చారు. ‘‘ఇప్పటి ఇండియా చాలా డిఫరెంట్. దశాబ్దాలుగా భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. చైనా, పాక్​ల నుంచి ఎలాంటి సవాల్ ఎదురైనా​ తిప్పికొట్టేందుకు మేం సిద్ధం” అని చెప్పారు.  బుధవారం ఉగాండా రాజధాని కంపాలాలో ప్రవాస భారతీయులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైశంకర్​ మాట్లాడారు. 

“అది యూరీ అయినా.. బాలాకోట్​ అయినా.. తాడోపేడో తేల్చుకునే సత్తా నేటి భారత్​కు ఉంది” అని ఆయన చెప్పారు. ‘‘మూడేళ్లుగా చైనా వరుసగా  ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడుతోంది. పెద్దసంఖ్యలో ఆర్మీని మన బార్డర్​లో మోహరిస్తోంది. మేం దానిపై ఇప్పుడు ఎక్కువ ఫోకస్​ పెట్టాం. అక్కడ మరింత పని జరగాల్సి ఉంది” అని వివరించారు. ‘‘ఇప్పుడు ఇండియాను ఏ దేశం కూడా ఒత్తిడి చేయలేదు. పెట్రోలు, డీజిల్​ ఎక్కడ కొనాలి? అనేది మనకు ఎవరూ చెప్పలేరు. దేశ పౌరుల ప్రయోజనాల కోణంలోనే మేం పనిచేస్తాం” అని జైశంకర్​ తేల్చిచెప్పారు.