పక్షుల ఆకలి తీర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా ఫీడ్‌బాక్స్‌లను ఏర్పాటు చేస్తోంది. కాగజ్‌నగర్ పరిధిలోని రవీంద్రనగర్ ఖర్జెల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద, నర్సరీలో చిరు ధాన్యాలతో కూడిన బాక్స్‌లను చెట్లకు వేలాడదీశారు. పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీళ్ల ట్రేలను సైతం ఏర్పాటు చేశారు. ఆహారం వేస్ట్ కాకుండా.. బాక్స్‌లకు ప్రత్యేకంగా రంధ్రాలు ఏర్పాటు చేయడంతో పాటు.. గింజలు అయిపోగానే తిరిగి నింపేలా ప్లాన్ చేశారు. - కాగజ్‌నగర్, వెలుగు
