జూ పార్కులో వన మహోత్సవం

జూ పార్కులో  వన మహోత్సవం

హైదరాబాద్​సిటీ, వెలుగు: నెహ్రూ జూ పార్కులో ఆదివారం జరిగిన వన మహోత్సవానికి స్టేట్ పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, వైల్డ్‌‌‌‌లైఫ్ పీసీసీఎఫ్ ఎలుసింగ్ మెరు పాల్గొని ఫికస్ చెట్లు నాటారు. రెండేళ్ల వయసున్న ఆఫ్రికన్ సర్వల్ క్యాట్​లను ఎన్​క్లోజర్​లో విడుదల చేసి ప్రదర్శనకు అందించారు. అలాగే తెలంగాణ మ్యాప్ ఆకారంలో రూపొందిన ఫాజిల్ పార్క్ గార్డెన్‌‌‌‌ను ప్రారంభించారు. జూలో సర్వల్ క్యాట్‌‌‌‌లతో సహా 195 వివిధ జాతుల జంతువులను ఎన్​క్లోజర్​లలో పెంచుతున్నట్లు డాక్టర్ సువర్ణ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ ‘తమ తల్లి పేరుతో ఒక మొక్క’ నాటాలని పిలుపునిచ్చారు.