
న్యూఢిల్లీ: బిహార్‌లో లా అండ్ ఆర్డర్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇండియాకు బిహార్ క్రైమ్ క్యాపిటల్‌గా మారిందని ఆరోపించారు. నితీశ్ తన సీఎం సీటును కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారని, ఆయన మంత్రివర్గం కమీషన్లు కలెక్ట్ చేసుకోవడంలో మునిగిపోయారని ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ప్రభుత్వాన్ని మార్చడానికి కాదని, రాష్ట్రాన్ని కాపాడటానికి అని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బిహార్‌లో 11 రోజుల్లో 31 హత్యలు జరిగాయని పేర్కొంటూ మీడియాలో వచ్చిన వార్తలను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘
‘బిహార్.. ఇండియాకు క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయింది. ప్రతి ఒక్క ప్రాంతంలో భయం. ప్రతి ఇంట్లో అశాంతి! నిరుద్యోగులను హంతకులుగా మారుస్తోంది. సీఎం తన సీటును కాపాడుకోవడంలో, మంత్రులు కలెక్షన్లలో బిజీగా ఉన్నారు” అని విమర్శించారు.