అలుగు ను అమ్మే య‌త్నం.. అడ్డుకున్న అధికారులు

అలుగు ను అమ్మే య‌త్నం.. అడ్డుకున్న అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అరుదైన వ‌న్య‌ప్రాణుల్ని అమ్మి సొమ్ము చేసుకోవాల‌నుకుంటున్నారు కొంద‌రు వ్యక్తులు. పాల్వంచకు చెందిన ముగ్గురు వ్యక్తులు కిన్నెరసాని అభయారణ్యంలో వన్యజీవి అలుగును వేటాడి ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా శనివారం వైల్డ్ లైఫ్ అధికారులు పట్టుకున్నారు. అలుగు వీపు మీద ఉండే పెంకులకు మార్కెట్లో కేజీకి లక్ష రూపాయల డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు అలుగు లను వేటాడుతున్నారు. సుమారు 2 నెలల క్రితం కూడా అలుగు పెంకులను తరలిస్తున్న స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. వైల్డ్ లైఫ్ ఎఫ్.డి.ఓ దామోదర్ రెడ్డి నిందితులను పట్టుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

రెండు వారాల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లాలో కూడా ఇద్ద‌రు యువ‌కులు అలుగును అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అట‌వీ అధికారులు వారిని ప‌ట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

forest officers caught three men were trafficking wildlife animal in bhadradri kothagudem district