పత్తిపంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

పత్తిపంటను  ధ్వంసం చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు

చండ్రుగొండ, వెలుగు : మండలంలోని రావికంపాడు గ్రామ శివారులోని పోడుభూముల్లో సాగు చేసిన పత్తి పంటను మంగళవారం రాత్రి ఫారెస్ట్ ఆఫీసర్లు ధ్వంసం చేశారు. బుధవారం చేనుకు వెళ్లిన బాధితులు పీకిన మొక్కలు చూసి  బోరున విలపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 

రావికంపాడు గ్రామానికి చెందిన గుగులోతు వాలి, తేజావత్ సరోజ ఐదు ఎకరాల పోడు భూములో పత్తి సాగు చేశారు.  ఏండ్లతరబడి పోడు నరికి పంటలు సేద్యం చేస్తున్నామని, కానీ కొత్తగా పోడు నరికినట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై రేంజర్ ఎల్లయ్యను వివరణ కోరగా కొత్తగా ఫారెస్ట్ లో పెద్ద చెట్లను నరికి పోడు సాగు చేస్తున్నారన్నారు. పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్ల తో వారికి కౌన్సిలింగ్ ఇచ్చినా తీరు మారలేదని చెప్పారు. కొత్తగా పోడు నరికితే చర్యలు తీసుకుంటామని ఈహెచ్చరించారు.