మంగపేట, వెలుగు : పచ్చని అడవి జీవవైవిధ్యం కలిగినదని, అడవి కేవలం జంతువులకు పక్షులకు నివాసం మాత్రమేనని, ఇతరులెవరూ అడవిలో అక్రమంగా నివాసం ఉండకూడదని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్తెలిపారు. శనివారం ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఎనిమిది కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఛత్తీస్గడ్కు పంపించారు.
వీరు నెల రోజుల కింద కూడా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకోవడానికి వెంకటాపురం సమీపంలోని చాకిరేవు గుత్తికోయ గుంపు నుంచి అవసరమైన వస్తువులతో రావడంతో ఫారెస్ట్ సిబ్బంది గమనించినట్లు అశోక్పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్వో హనుమా, ఎఫ్బీవోలు పుణ్యలత, లక్ష్మీదేవి, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
