భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం అటవీ రేంజ్ లింగాపురం బీట్లో అటవీ సిబ్బంది బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మెలను పట్టుకున్నారు. పట్టుబడిన కలప రూ.1,86,712 ఉంటుందని ఎఫ్ఎస్వో బి.నాగరాజు తెలిపారు. పట్టుబడిన కలపను భద్రాచలం డిపోకు తరలించారు.
