మాదాపూర్, వెలుగు: సంస్థలో తోటి పార్టనర్వాటాను తమ పేరుకి బదిలీ చేయాలని ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడమే కాకుండా సంతకాలు ఫోర్జరీ చేసిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పురుషోత్తం నాయుడిపై మాదాపూర్పోలీస్స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణమోహన్వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసం ఉండే రాజశేఖర్‌రావు, పరకాల బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పురుషోత్తంనాయుడు ముగ్గురు కలిసి విజన్రిసార్ట్స్పేరుతో రియల్‌సంస్థ నిర్వహిస్తున్నారు.
కంపెనీలో పురుషోత్తం, ధర్మారెడ్డి, రాజశేఖర్రావుకు 60 శాతం, మరో ఆరుగురికి 40 శాతం వాటా ఉంది. అయితే, సంస్థ డెవలప్మెంట్విషయంలో ధర్మారెడ్డి, పురుషోత్తంతో రాజశేఖర్రావుకు గొడవ జరిగింది. దీంతో వీరిద్దరూ మాదాపూర్‌లోని రాజశేఖర్‌రావు ఇంటికి వెళ్లి కంపెనీలో తన వాటాను ఇచ్చేసి తప్పుకోవాలని బెదింరించారు. ఆయన నిరాకరించడరంతో సంతకాన్ని మరో వ్యక్తితో ఫోర్జరీ చేయించి నాంపల్లిలో రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశారు. ఈ క్రమంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, తన సంతకం ఫోర్జరీ చేసినట్లు రాజశేఖర్‌రావు సెప్టెంబర్28న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పురుషోత్తం నాయుడుతోపాటు ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
