ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు భుజంగరావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు భుజంగరావు

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ-2గా ఉన్న మాజీ ఏసీపీ భుజంగరావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు బుధవారం విచారించారు. కేసు చివరి దశకు చేరుకోవడంతో ఈ విచారణకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. భుజంగరావుతో పాటు ఇతర శాఖలకు చెందిన పలువురు అధికారులను కూడా సిట్ బృందం ప్రశ్నించినట్టు సమాచారం.

ఈ వ్యవహారంలో మరికొందరు అధికారుల ప్రమేయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు, చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. తాజా విచారణ ద్వారా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్యాప్తు దాదాపు పూర్తి కావడంతో, త్వరలోనే సమగ్ర వివరాలతో కూడిన చార్జ్‌‌షీట్‌‌ను కోర్టులో దాఖలు చేసేందుకు సిట్ 
సిద్ధమవుతోంది