
- నేటి నుంచి నాలుగు రోజుల పాటు విచారణ
హైదరాబాద్, వెలుగు: మణికొండ ఎలక్ట్రిసిటీ మాజీ ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్) అంబేద్కర్‌ను ఏసీబీ తన కస్టడీలోకి తీసుకోనుంది. ఈ మేరకు సోమవారం నుంచి గురువారం సాయంత్రం వరకు నాలుగు రోజుల పాటు ఆయనను విచారించేందుకు అనుమతిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు ఏసీబీకి ఇటీవలే ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబేద్కర్‌ను.. సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
చంచల్ గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించి ప్రశ్నించనున్నారు. కాగా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సెప్టెంబర్ 16న అంబేద్కర్ నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇండ్లల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, నగదు గుర్తించారు. ఆయన ఇంట్లో రూ.2.18 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.