కాంగ్రెస్లో చేరిన బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు

కాంగ్రెస్లో చేరిన బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు

తాడ్వాయి, వెలుగు: బీజేపీకి చెందిన తాడ్వాయి మండల మాజీ అధ్యక్షుడు షేర్ బద్దం రమణారెడ్డి మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రమణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి ఉన్నారు.