లుక్‌ అవుట్ నోటీసు రద్దు చేయండి

లుక్‌ అవుట్ నోటీసు రద్దు చేయండి

హైదరాబాద్, వెలుగు :  పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు సర్క్యులర్ ను బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహీల్ అలియాస్ మహ్మద్ రాహీల్ అమీర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు విదేశాల నుంచి రాగానే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. అదే విధంగా తాను విదేశాల నుంచి వస్తే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నందున లుక్‌ అవుట్ నోటీసును రద్దు చేయాలని కోరారు. 

ALSO READ ;అమ్మవారి ఆలయ హుండీలో ఇరికిన చేయి

ఈ కేసులో తాను నిర్దోషినని, రెండో నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే తనపై పోలీసులు కేసు పెట్టారని వివరించారు. ఇదే కేసులో మూడో నిందితుడైన తన తండ్రి షకీల్‌ను ఈ నెల 19లోగా పోలీసుల ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. తన తండ్రి వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, విదేశాల్లోని తన తండ్రికి తన సాయం అవసరమన్నారు. తాను విదేశాల నుంచి ఇండియాకు వస్తే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నందున లుక్‌ అవుట్ నోటీసును రద్దు చేయాలని పిటిషన్‌లో హైకోర్టును కోరారు.