
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా గెలుపు అవకాశాలపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్కు వెళ్లడం కష్టమేనన్నాడు. టీ20 వరల్డ్ కప్లో జట్ల మధ్య విపరీతమైన పోటీ ఉందని...కాబట్టి.. భారత్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు తక్కువ అని చెప్పాడు. అయితే టాప్ 4లో చోటు దక్కించుకుంటేనే టీమిండియా అవకాశాలపై వ్యాఖ్యానించగలనని చెప్పుకొచ్చాడు.
30 శాతం మాత్రమే ఛాన్స్...
టీ20 వరల్డ్ కప్లో ఏ జట్టు ఎప్పుడు ఓడిపోతుందో..ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేమని కపిల్ దేవ్ అన్నాడు. ఒక మ్యాచ్లో గెలిచిన టీమ్..మరో మ్యాచ్లో ఓడిపోవచ్చన్నాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అన్న ప్రశ్నలకు ...కష్టమనే సమాధానమిచ్చాడు. తాను అంత దూరం ఆలోచించడం లేదని..ముందు టాప్ 4లో రోహిత్ సేన స్థానం దక్కించుకుంటుందా లేదా అన్న దాని గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు వివరించాడు. భారత జట్టు టాప్ 4లోకి వచ్చేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉందని వెల్లడించాడు.
భారత్ ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్..
టీమిండియాకు బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందని కపిల్ దేవ్ ప్రశంసించాడు. కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ వంటి స్టార్లతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు..సూర్యకుమార్ లాంటి 360 బ్యాట్స్మన్ ఉండటం జట్టును అదనపు బలం అన్నాడు. అయితే వీరు నలుగురు రాణిస్తే..జట్టుకు తిరుగుండదని తెలిపాడు.
పాక్తో పోరుకు రెడీ...
టీ20 వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. మెల్‌బోర్న్లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే...టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి మాత్రం భారత్ సులభంగా సెమీస్ చేరుతుందని భావించగా...కపిల్ మాత్రం...భారత జట్టు సెమీస్ చేరడం కష్టమే అంటున్నాడు.