సూర్యకుమార్ను తక్కువ అంచనా వేయొద్దు:రవిశాస్త్రి

సూర్యకుమార్ను తక్కువ అంచనా వేయొద్దు:రవిశాస్త్రి

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ను భారత మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.  సూర్యను తక్కువ అంచనా వేయొద్దని ఇతర జట్లకు సూచించాడు. సూర్య ఏబీ డివిలియర్స్ లాంటి వాడని చెప్పాడు. అతని షాట్లు అసాధారణమని ప్రశంసించాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే రెండు మూడు సార్లు విఫలమైనా...అతన్ని మాత్రం తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. 15 లేదా 20 పరుగులు చేశాక..అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదన్నాడు. 

అత్యుత్తమ ఆటగాడు..

సూర్యకుమార్ ఖచ్చితంగా విధ్వంసకర ఆటగాడని రవిశాస్త్రి ప్రశంసించాడు. తనదైన రోజున మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా..జట్టును గెలిపించగల సత్తా ఉన్నా ప్లేయర్ అని కొనియాడాడు. అతని షాట్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడని చెప్పాడు. అతను ఉత్తమ టీ20 ప్లేయర్ కాకపోయినా..కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని తెలిపాడు. అతను స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడంటే..ప్రత్యర్థి వణకాల్సిందేనని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. భారత్ న్యూజిలాండ్ తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరడంతో ..అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి.