
జనగామ జిల్లా : మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్ లో కబడ్డీ క్రీడోత్సవాల వేడుకకు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కబడ్డీ క్రీడోత్సవాల బహుమతుల ప్రదానోత్సవం మొదలుపెట్టడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరితోపాటు నిర్వాహకులు స్టేజి ఎక్కారు. కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ఓబులపూర్, చాగల్లు జట్ల మధ్య కొనసాగింది. ఇందులో ఓబులపూర్ జట్టు విజేతగా నిలిచింది. బహుమతి ప్రధానం చేసేందుకు కడియం శ్రీహరి స్టేజిపైకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా స్టేజి కూలిపోయింది. ఆయనతోపాటు నిర్వాహకులు కూడా కిందపడినా.. వెంటనే లేచి ఏమీ కాలేదంటూ చేతులు ఊపారు. దీంతో షాక్ కు గురైన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
For More News..
మాజీ ముఖ్యమంత్రి సోదరుడు దారుణహత్య
ట్రూత్ ఆర్ డేర్.. నగ్న వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన తోటి విద్యార్థి
ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు
108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి