
న్యూఢిల్లీ: బీజేపీ వెటరన్ లీడర్ ఎల్ కే అద్వానీ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని అపోలో అసుపత్రి వర్గాలు తెలిపాయి. గత నెల మొదటి వారంలో కూడా అద్వానీ అస్వస్థతకు గురవడంతో అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు.
కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన ఆయనను డిశ్చార్జి చేశారు. అంతకుముందు అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో అద్వానీ చికిత్స పొందారు. మళ్లీ ఆయన అస్వస్థతకు గురయ్యారు.