- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేకుంటే సంపూర్ణ న్యాయం జరగదని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం రామ్‌నగర్‌లో ఆయనతో బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణి మంజరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా డిసెంబర్ 15న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలని, బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని, ప్రధాని మోదీ సబ్ కోటా కల్పిస్తారనే విశ్వాసం తనకుందని తెలిపారు. తారకేశ్వరి, సంధ్యారాణి, శ్యామల, శైలజ పాల్గొన్నారు.

