
నిన్న హరియాణా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ తాజాగా తన ఎమ్మెల్యే పదవికీ రిజైన్ చేశారు. కర్నాల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈమేరకు అసెంబ్లీలో ప్రకటించారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకితభావంతో చేస్తానని చెప్పారు. కర్నాల్‌లో సీఎంనాయబ్ సైనీ పోటీ చేస్తారని వెల్లడించారు.
గత తొమ్మిదిన్నరేళ్లలో తాను సభా నాయకుడిగా పనిచేశాను. నా చివరి శ్వాస వరకు హర్యానా ప్రజలకు సేవ చేస్తానని ఖట్టర్ అన్నారు. నయాబ్ సైనీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన కొద్దిసేపటికే ఖట్టర్ ప్రకటన వెలువడింది.
రెండు రోజుల క్రితం ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో నాయబ్ సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖట్టర్ 2014 నుండి కర్నాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఖట్టర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.