బలపరీక్ష నెగ్గిన హర్యానా కొత్త సీఎం

బలపరీక్ష నెగ్గిన హర్యానా కొత్త సీఎం

హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం (మార్చి 13) బలపరీక్షలో విజయం సాధించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన ఫ్లోర్ టెస్ట్ లో 48 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం, సంకీర్ణ భాగస్వామి అయిన జననాయక్ జనతా పార్టీ( జెజెపి) తో విడిపోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో హర్యానా కొత్త సీఎం గా నయాబ్ సింగ్ సైనీ ఎన్నిక, అసెంబ్లీ బలనిరూపణ జరిగాయి. 

మనోహర్ లాల్ ఖట్టర్ ఊహించని రాజీనామా తర్వాత సైనీ మంగళవారం (మార్చి12) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం 48 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని బీజేపీ, జేజేపీల మధ్య లోక్ సభ సీట్ల కేటాయింపు విషయంలో విభేదాల కారణంగా ఖట్టర్ హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.