టీమిండియా బలంగా ఉంది..ఎటాకింగ్ గేమ్ ఆడితే కప్ మనదే

టీమిండియా బలంగా ఉంది..ఎటాకింగ్ గేమ్ ఆడితే కప్ మనదే

2023 వన్డే వరల్డ్ కప్ టీమిండియాదే అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. రీసెంట్గా జరిగిన వన్డే సిరీస్లలో భారత్ సత్తా చాటిందని..వరల్డ్ కప్ వరకు అదే ఆటను కొనసాగించాలని కోరాడు. ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉందన్నాడు. అంతేకాకుండా ఎటాకింగ్ గేమ్ ఆడుతోందని..ఇదే కొనసాగిస్తే వరల్డ్ కప్ ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

టీమిండియాలో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని గంగూలీ అన్నాడు. అలాంటి భారత జట్టు ఎప్పటికీ వీక్ కాలేదన్నాడు. ఎంతో మంది సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారని..వారికి ఆడే అవకాశం కూడా రావడం లేదన్నాడు. కాబట్టి వన్డే వరల్డ్ కప్ వరకు ఇదే టీమ్ను కొనసాగించాలని..మార్పులు చేయొద్దని సూచించాడు. 

వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో ధైర్యంగా ఆడాలని గంగూలీ చెప్పాడు. ట్రోఫీ గెలుస్తామో లేదో కానీ.. ఫియర్ ఉండకూడదన్నాడు. గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా,షమీ లాంటి స్టార్లు టీమిండియా సొంతమన్నాడు. ఈ జట్టు ఎప్పటికీ బలహీనం కాదని..ఖచ్చితంగా భారత్ మరోసారి సొంత గడ్డపై వరల్డ్ కప్ సాధిస్తుందని నమ్మకం ఉందన్నాడు.