వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడం కష్టమే..

వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడం కష్టమే..

వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేయడం కష్టమని టీమిండియా మాజీ క్రికెటర్..టీమిండియా సౌతాఫ్రికా వన్డే సిరీస్ తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. భారత క్రికెట్ రిజర్వ్ బెంచ్లో అద్భుతమైన ఆటగాళ్లున్నారని కొనియాడారు. యువకులు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో 2023 వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ను సెలక్ట్ చేయడం సెలక్టర్లకు కత్తిమీదసామే అని చెప్పుకొచ్చాడు. 

కుర్రాళ్ల మధ్య తీవ్రమైన పోటీ..
టీమిండియా రిజర్వ్ బెంచ్లో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారని లక్ష్మణ్ అన్నాడు. క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారని మెచ్చుకున్నారు. కుర్రాళ్లంతా..భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నారని..వారి మధ్య మంచి పోటీ వాతావరణం ఉందన్నాడు. ఈ నేపథ్యంలో 2023 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించడం సెలక్టర్లకు కష్టం అవుతుందన్నాడు. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి జట్టు ఆడుతోందని..అయితే ప్రధాన జట్టు ఆటగాళ్లు వస్తే పోటీ మరింత పెరుగుతుందన్నాడు.  అయితే బాగా ఆడేవారినే సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. 

కోచ్గా బాగానే ఉంది
‘బ్యాకప్‌ కోచ్‌గా ఇప్పటి వరకు బాగానే ఉందని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. ఐర్లాండ్ సిరీస్  నుంచి బ్యాకప్ కోచ్గా తన ప్రయాణం మొదలైందన్నాడు.  ఇంగ్లాండ్తో ఒక టీ20 మ్యాచ్తో పాటు..జింబాబ్వే సిరీస్కు కోచ్గా వ్యవహరించానన్నాడు. అయితే ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్..టీ20 వరల్డ్ కప్ కోసం వెళ్లడంతో...జట్టుకు సేవలు అందించేందుకు ప్రస్తుతం వెసులుబాటు లభిస్తోందన్నాడు.