ఆస్పత్రిలో చేరిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ

ఆస్పత్రిలో చేరిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఆస్పత్రిలో చేరారు. గత రెండు వారాల్లోనే  ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ఫ్లూ, న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన  తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు.  హాస్పిటల్ లో ఉన్న తన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇన్ఫెక్షన్ సోకినపుడు తాను మెక్సికోలో ఉన్నానని..ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్ చేరుకున్నానని లలిత్  చెప్పారు. తనను తీసుకురావడానికి సహాయం చేసిన ఇద్దరు వైద్యుల ఫొటోలను సైతం ఆయన షేర్ చేశారు. 

లలిత్ మోడీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆమెను తన బెటర్ లుకింగ్ పార్ట్ నర్ గా భావించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత లలిత్ ను తాను పెళ్లి చేసుకోవడం లేదని సుస్మితా సేన్ స్పష్టం చేసింది. కానీ వారిద్దరి మధ్య సంబంధాన్ని గురించి మాత్రం చెప్పలేదు. అలా లలిత్ మోడీ, సుస్మితా సేన్.. ఇద్దరూ కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో  వారిద్దరికి సంబంధించిన ఎలాంటి పోస్టులూ చేయకపోవడంతో .. వారు విడిపోయినట్టు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.