భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్

 భూకబ్జాకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించింది.  2024, జూన్ 28వ తేదీ శుక్రవారం ఆయనకు రాష్ట్ర హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది.

ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చి.. రూ. 600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. 

ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగి.. 2024, ఫిబ్రవరి 1వ తేదీన హేమంత్ సోరెన్ ను ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు.