లక్సెట్టిపేట మండలంలో తల్లిదండ్రులను వేధించిన..మాజీ విలేకరి అరెస్ట్

  లక్సెట్టిపేట మండలంలో తల్లిదండ్రులను వేధించిన..మాజీ విలేకరి అరెస్ట్

లక్సెట్టిపేట, వెలుగు: తల్లిదండ్రులను వేధించిన కేసులో లక్సెట్టిపేట మండలంలోని శాంతాపూర్ కు చెందిన మాజీ విలేకరి శశిధర్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. శశిధర్​రెడ్డి గతంలో ఓ సంస్థలో విలేకరిగా పనిచేశాడు. కొద్దికాలం తర్వాత అతడిని సంస్థ తొలగించింది.

అయితే ఇప్పుడు కూడా విలేకరిగా చలామణి అవుతూ ఆస్తి పంపకం విషయంలో తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు విచారణ చేపట్టి శశిధర్​రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.