తప్పుడు ఆరోపణలపై మాజీ జడ్జి పిటిషన్

తప్పుడు ఆరోపణలపై  మాజీ జడ్జి పిటిషన్

హైదరాబాద్, వెలుగు: తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతపు పదవీ విరమణకు దారి తీసిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టును మాజీ జడ్జి ఆశ్రయించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టు రిజిస్ట్రీకి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జగిత్యాలలో అదనపు జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆదేశాలతో కక్ష పెంచుకున్న కొందరు న్యాయ వ్యవస్థలోని మరికొందరితో కలిసి తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారంటూ మాజీ జడ్జి పి.రంజన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశా రు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ఈ ఫిర్యాదుల కారణంగానే హైకోర్టు తనను 2020లో నిర్భంధ పదవీ విరమణ చేయించింద న్నారు. విచారణ జరిపిన బెంచ్.. రాష్ట్రపతి, సుప్రీం సీజైఐకి, గవర్నర్‌‌‌‌కి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ, విచారణ వాయిదా వేసింది.