సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం

సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం

రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది.  ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో సాగుతోంది. అయితే ఈ యాత్రలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వచ్చారు. రాహుల్ గాంధీతో కలిసి సిద్ధరామయ్య పాదయాత్ర చేశారు.

ఆపసోపాలు పడుతూ పరుగు..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చారు. వారందరిని చూసి రాహుల్ గాంధీ మరింత ఉత్సాహంగా నడిచారు. అయితే ఈ క్రమంలో సిద్ధరామయ్య కలవడంతో..రాహుల్ గాంధీకి మరింత ఊపొచ్చింది. సిద్ధరామయ్య చేతిని పట్టుకుని రాహుల్ గాంధీ రన్నింగ్ చేశారు. రాహుల్ గాంధీ స్పీడును అందుకోలేక సిద్ధరామయ్య ఆపసోపాలు పడ్డారు.

ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు..
తమ ప్రియతమ నేత సిద్ధరామయ్య చేతిని పట్టుకుని రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు తెగ సంబరపడిపోయారు. 75 ఏళ్ల వయసులో రాహుల్ గాంధీతో కలిసి సిద్ధరామయ్య పరుగు తీయడం కర్ణాటక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను మరింత ఉత్సాహ పరిచింది. దీంతో ఆయన్ను ఉత్సాహపరిచేలా ఈలలు, కేకలు వేస్తూ వారి వెంట పరుగుతీశారు.