పునరావాస స్థలం కబ్జా..మాజీ నక్సలైట్లు ఆరోపణ

పునరావాస స్థలం కబ్జా..మాజీ నక్సలైట్లు ఆరోపణ

ఉప్పల్, వెలుగు: తాము జనజీవన స్రవంతిలో కలిస్తే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను కార్పొరేటర్​ కబ్జా చేశారని మాజీ నక్సలైట్లు ఆరోపించారు. ఉప్పల్​లో పలువురు మాజీ నక్సలైట్లు మీడియాతో మాట్లాడారు. జనం కోసం అడవుల బాట పట్టిన తాము గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లొంగిపోయామన్నారు. దీంతో తమకు ఉప్పల్ లోని హైకోర్టు కాలనీ సమీపంలో వెయ్యి గజాల ఇంటి స్థలాలను 2003లో టీడీపీ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అప్పటినుంచి తమ స్వాధీనంలోనే ఉన్న స్థలాలను ఇటీవల చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీత, భర్త బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు.