
మాజీ మంత్రి చెరుకుముత్యం రెడ్డి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) ఉదయం కన్నుమూశారు. ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రాజకీయ ప్రస్థానం గ్రామ సర్పంచ్ గా ప్రారంభమైంది. సహకార సంఘం ఛైర్మన్‌గా రెండేళ్ల పాటు పాటు సేవలందించారు. 1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు.ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముత్యం రెడ్డి TRS పార్టీలో చేరారు..