బీసీల బహిరంగ సభను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

బీసీల బహిరంగ సభను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే  గంగుల కమలాకర్
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే  గంగుల కమలాకర్  

కరీంనగర్ టౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఈనెల14న కరీంనగర్ సిటీలోని జ్యోతిబాపూలే గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. చింతకుంటలోని బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన మీటింగ్ లో  పాల్గొని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారితో కలిసి ఆయన మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ పై  కాంగ్రెస్  ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండకడతామన్నారు. కాంగ్రెస్ కు  చిత్తశుద్ధి లేదని, బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు.  బీసీలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు. 

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఒడితెల సతీశ్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్​ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిటీ  ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.