25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్​ రావు

25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్​ రావు

కాంగ్రెస్​ 11 వేలకు మాత్రమే నోటిఫికేషన్​ ఇచ్చింది 

సిద్దిపేట, వెలుగు : డీఎస్సీలో 25వేల ఖాళీలు  భర్తీ చేస్తామని చెప్పిన సర్కారు 11వేల ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని మాజీ మంత్రిహరీశ్​ రావు  అన్నారు. మొత్తం 25 వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలోని బాయ్స్ హైస్కూల్ లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేసి మాట్లాడారు.  

ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నానని, మాటిచ్చినట్టు ప్రభుత్వ పాఠశాలలకు  పారిశుధ్య సిబ్బందితో పాటు ఉచిత కరెంటును ఇవ్వాలన్నారు. తర్వాత సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​ను తనిఖీ చేశారు. రోగులు, వారి అటెండర్స్​తో మాట్లాడారు.