డైవర్షన్ డ్రామా.. ఎన్ని నోటీసులిచ్చినా భయపడను: హరీశ్ రావు

డైవర్షన్  డ్రామా.. ఎన్ని నోటీసులిచ్చినా భయపడను: హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాను ఏ తప్పు చేయలేదని.. ఎన్ని నోటీసులిచ్చినా సీఎం రేవంత్ బెదిరింపులకు  భయపడేది లేదన్నారు . సీఎం బామ్మర్ది భాగోతాన్ని బయట పెట్టినందుకే   నోటీసులు  పంపారని  ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని..విచారణకు హాజరవుతానని చెప్పారు.  

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు  అన్నారు.  సమాజంలో చట్టంపై తమకు గౌరవం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తమకు  అరెస్టులు కొత్త కాదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు మహాలక్ష్మి స్కీమ్, వృద్ధాప్య పెన్షన్ గురించి ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చారని విమర్శించారు హరీశ్.  కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలను బయటపెడుతున్నందుకే నోటీసులన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ కు .. మున్సిపల్ ఎన్నికల ముందు తనకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయని తెలిపారు. 

తనపై ఫోన ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేసిందన్నారు.  రెండు సంవత్సరాల నుంచి ఫోన్ టాపింగ్ కేసు నడుస్తుందన్నారు. బొగ్గు కుంభకోణం విషయం పై ఏ మంత్రి స్పందించలేదన్నారు.  ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కుంబకోణలను బయటకు తీస్తామని హరీశ్ అన్నారు. బొగ్గు కుంబకోణం గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డికి బొగ్గు కుంభకోణం పై లేఖ రాస్తానని చెప్పారు. నైని బ్లాక్ తో పాటు అన్ని బొగ్గు టెండర్లను రద్దు చెయ్యాలన్నారు . తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమనించిన నాయకులుగా  ఎక్కడా తలొగ్గమన్నారు హరీశ్.