- 95 ఏండ్ల వయస్సులో నాగారంలో పోటీ చేస్తున్న రాంచంద్రారెడ్డి
సూర్యాపేట, వెలుగు : మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి రాంచంద్రారెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ పదవి కోసం రాంచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. 95 ఏండ్లు ఉన్న రాంచంద్రారెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ క్యాండిడేట్‌గా రాంచంద్రారెడ్డి నిలిచారు. కాగా, తనను గెలిపిస్తే వయసుతో సంబంధం లేకుండా.. యువకుల కంటే ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తానని రాంచంద్రారెడ్డి చెప్పారు.
